ఘనంగా ‘సార్’ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరీ వివాహం

-

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడయ్యారు. పూజా అనే యువతితో ఆయన ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన వీరి వివాహానికి నటుడు నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, నటి కీర్తి సురేశ్‌, దర్శకుడు వెంకీ కుడుముల హాజరయ్యారు. నూతన వధూవరులతో కలిసి దిగిన ఓ ఫొటోని నితిన్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

‘‘జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతోన్న వెంకీ స్వామికి కంగ్రాట్స్‌. పూజాతో నీ జీవితం మరెంతో అందంగా మారాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

‘జ్ఞాపకం’తో హీరోగా పరిచయమయ్యారు నటుడు వెంకీ. ‘స్నేహగీతం’, ‘ఇట్స్‌ మై లవ్‌ స్టోరీ’ చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. 2018లో విడుదలైన ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా మారారు. ‘మిస్టర్‌. మజ్ను’, ‘రంగ్‌ దే’ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన ధనుష్‌తో ‘సార్‌’ తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version