ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..మాదిగ కులం ఆత్మగౌరవం కాపాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. వర్గీకరణ అంశంపై దేశ స్థాయిలో చర్చ జరగడానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.
వర్గీకరణ అంశంలో ఎవరు ఇబ్బంది పడకుండా తీసుకొచ్చిన ఈ బిల్ కు జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు. కాగా, చంద్రబాబు సైతం ఎస్సీ వర్గీకరణకు సానుకూలమని ప్రకటించారు. దీంతో త్వరలోనే ఏపీ అసెంబ్లీలోనూ ఎస్సీ వర్గీకరణ బిల్ పెట్టనున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ బిల్ పెట్టగా సభ్యులందరూ ఆమోదం తెలిపారు.