దిశ నిందితుడు భార్య విష‌యంలో కొత్త మ‌లుపు.. 13 ఏళ్ల‌కే..

-

దిశ హత్యాచార కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య మైనర్ అని తాజా విచారణలో తేలింది. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు నిన్న నిందితుడి గ్రామంలో జరిపిన ప్రాథమిక విచారణలో ఈ విషయం వెల్లడైంది. అయితే ఆమె వయసు 13సంవత్సరాల ఆరు నెలలుగా గుర్తించారు. ఆమె పుట్టింది 15-06-2006గా ఉంది. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతి కూడా. దీంతో చెన్నకేశవులు తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడారు. బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధకారులు దృష్టికి తీసుకెళ్లారు. అందుకు వారు నిరాకరించారు.

13 ఏళ్ల‌కే.. ఆరు నెల‌ల గర్భవతి:
తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ వద్ద ఆమె ఉండేది. చెన్నకేశవుల‌ను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అత్తగారింటికి వచ్చింది. అయితే ఆ బాలికకు మరో చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరు తమ బాబాయి ఇంట్లో ఉంటున్నారు. వారినైనా సంరక్షణ కేంద్రానికి పంపిస్తారా అని అధికారులు అడిగారు. బాలిక చెల్లెలు తమ వద్దే ఉంటుందని, తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తానని వారి బాబాయి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version