మహిళల రక్షణ కోసం జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం. ఇక తాజాగా ఆపదలో ఉన్న మహిళలకు సాయం అందించేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లో ఈ చిన్న యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చేసుకుని.. ఆపద సమయంలో చిన్న బటన్ నొక్కితే ఐదు నిమిషాల్లో పోలీసులు స్పాట్‌కు చేరుకునేలా యాప్‌ను తయారు చేశారు. ఇలా ఏదైనా ఆపదలో ఉన్న యువతులు, తక్షణ సహాయం కోరుకుంటే అందించే ‘దిశ’ యాప్ కు ఇప్పుడు ఏపీలో తెగ డిమాండ్ ఉంది. ఈ యాప్ ను నాలుగు రోజుల క్రితం విడుదల చేయగా, ఇప్పటికే 50 వేలకు డౌన్ లోడ్స్ నమోదయ్యాయి.
ఓ రీజనల్ యాప్ కు ఇంత స్పందన రావడం ఎంతో గర్వకారణమని ‘దిశ’ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ వెల్లడించారు. గూగుల్ ప్లే స్టోర్ లో దీనికి దాదాపు 5 స్టార్ రేటింగ్ ఉందని, 4.9 రేటింట్ వచ్చిందని ఆమె అన్నారు. కాగా, ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు సగటున రోజుకు 2 వేలకు పైగా టెస్ట్ కాల్స్ చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా, పోలీసు సిబ్బంది ఎలా స్పందిస్తున్నారని పరీక్షిస్తున్నారని, తాము వెంటనే ప్రతిస్పందిస్తున్నామని అన్నారు. ఆపై వారికి ఇకపై ఇలా చేయవద్దని కౌన్సెలింగ్ ఇస్తున్నామని అన్నారు.