బ్రేకింగ్ : వర్మ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన దిశ తండ్రి

-

రాంగోపాల్ వర్మ కార్యాలయానికి దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి బయల్దేరారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలుపుదల చేయాలని అర్జీవి కార్యాలయం ముందు శ్రీధర్ రెడ్డి ధర్నాకు దిగనున్నారు. తన నివాసం నుండి హైదరాబాద్ అర్జీవి కార్యాలయానికి శ్రీధర్ రెడ్డి బయల్దేరినట్టు సమాచారం. తన కూతురు సంఘటన ను తెరకెక్కిస్తున్న చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. అందుకోసం ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ అంశం మీద వర్మ స్పందించ లేదు కానీ నిర్మాతగా ఉన్న నట్టి కుమార్ మాట్లాడాడు.

సినిమాను సినిమా లాగా మాత్రమే చూడాలన్న ఆయన చట్టాలకు లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ఎవ్వరి మనోభావాలను కించపరచే విదంగా సినిమాను తీయడం లేదని అయన ఆన్నారు. దిశ బయోపిక్ మేము తీయడం లేదన్న ఆయన మహిళ లపై జరుగుతున్న అత్యాచారాలు మళ్ళీ జరగకూడదని చట్టానికి , న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. దిశ తల్లిదండ్రులు ఎవ్వరిని సంప్రదించలేదన్న ఆయన కోర్టు ఎలా తీర్పు ఇస్తే దానికి అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు. పోకిరీలు పెట్టె కామెంట్స్ పై తాము ఏమి చేయలేమన్న ఆయన వర్మ వచ్చిన తర్వాత ఈ దిశ చిత్రం పై పూర్తి వివరాలు వెల్లడిస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version