ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. ఈ సమావేశాలు ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలతో మొదలవుతాయి. మొదటి రోజు సమావేశాలలో ముఖ్యంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.

శాసనసభ కార్యకలాపాలు ముగిసిన తర్వాత, వ్యాపార సలహా కమిటీ ( B usiness A dvisory C ommittee – BAC) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో, ప్రస్తుత సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలి, ఏయే అంశాలపై చర్చలు జరపాలి అనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ సమావేశాలు ప్రభుత్వ విధానాలు, కొత్త బిల్లుల ప్రవేశం, ప్రజల సమస్యలపై చర్చలు, బడ్జెట్ ఆమోదం వంటి అనేక ముఖ్యమైన అంశాలకు వేదిక కానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జగన్ వస్తారా? ఎప్పటి లాగే రాకుండా నిరసన తెలుపుతారా అనేది చూడాల్సి ఉంటుంది.