కొత్త బాయ్​ ఫ్రెండ్​తో దిశాపటానీ హాట్ సెల్ఫీ..

-

బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ హీరో టైగర్ ష్రాఫ్​ విడిపోయినట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడామె మరో బాయ్​ఫ్రెండ్​తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందనే పుకార్లు ఊపందుకున్నాయి. ఆమె పంచుకున్న సెల్ఫీ ఫోటోలు ఈ కొత్త చర్చకి దారితీసింది. కారులో హాట్‌ లుక్‌లో అతడితో కలిసి దిశా సెల్ఫీ దిగింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది దిశా. మరోవైపు హాట్‌ లుక్‌లో ఉన్న మరికొన్ని ఫోటోలను ఆమె అభిమానులతో షేర్‌ చేసింది. దీంతో మరోసారి దిశా ప్రేమలో పడిందా? అనేది టాక్‌ మొదలైంది.

అయితే దిశపటాని సెల్ఫీ దిగిన వ్యక్తి ఎవరో అసలు విషయం తర్వాత తెలిసింది.. ఆ వ్యక్తి ఎవరో కాదు దిశా ఫిట్‌ నెస్‌ ట్రైనర్‌ అలెగ్జాండర్‌ అలెక్స్ ఇలిక్‌గా.. అతను దిశాకి మంచి స్నేహితుడు అట. అలాగే మోడల్‌గా రాణిస్తున్నారు. త్వరలో హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో దిశా కూడా హెల్ప్ చేస్తుందని సమాచారం. అయితే వీరిద్దరు మంచి స్నేహితులే గానీ, బాయ్‌ ఫ్రెండ్‌ కాదని అంటున్నా.. దిశా పటానీ మాత్రం అతనితో సెల్ఫీ దిగిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. సెల్ఫీ లుక్‌లో తన ఎద అందాల విందుతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఈ ఫోటో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. హాట్‌ షేపులు చూపించేలా ఉన్న ఆమె పోజులు సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి.

దిశా పటానీ బికినీలో అయితే ఆ ఘాటు తట్టుకోవడం ఎవరితరం కాదు అన్నట్టుగా ఉంటుంది. తరచూ ఆమె సెక్సీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేస్తూ అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది దిశా. గ్లామర్‌ షో చేస్తే ఇంటర్నెట్‌ బద్దలైపోవాల్సిందే. ఆమె చేసే హాట్‌ షో ఆ రేంజ్‌లో ఉంటుంది మరి.. బోల్డ్ పోజులకు కేరాఫ్‌ దిశా. ప్రస్తుతం ఈ భామ జాన్‌ అబ్రహంతో కలిసి ‘ఏక్‌ విలన్‌ 2’లో నటిస్తుంది. మోహిత్‌ సూరి రూపొందిస్తున్నారు. దీంతోపాటు ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కే’లోనూ సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది దిశా.

Read more RELATED
Recommended to you

Exit mobile version