పెళ్లి అంటే నూరేళ్ళ జీవితం. అయితే ప్రస్తుత కాలంలో… కొన్ని అనివార్య కారణాల మూలంగా చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో విడాకుల వ్యవహారం మరీ ఎక్కువ అయిపోయింది. చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ విడాకులు తీసుకుంటున్నారు కొంత మంది. అయితే ఇలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది.
పెళ్లైన మూడో రోజే గొడవపడి… కోర్టు మెట్లెక్కిన జంటకు… హర్యానాలోని గురుగ్రామ్ కోర్టు. గురుగ్రామ్ పట్టణంలో వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన రెండు రోజులు కలిసి ఉన్న వీరు… మూడోరోజు విడిపోయారు. ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. వివాహం – విడాకులకు ఏడాది సమయం ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ… హిందూ వివాహ చట్టం 13- బీ ప్రకారం సమాచారాన్ని తొలగించాలని వారు కోరగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో జంట మూడు ముళ్ల బంధానికి… ముడి తెగి పోయింది. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు.. దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది.