చేనేత కార్మికులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. మరో రూ.30 కోట్లు మంజూరు!

-

కరీంనగర్ జిల్లా : చేనేత కార్మికుల కోసం త్విఫ్టు కోసం త్వరలో ముప్పయి కోట్లు మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హుజురాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో చేనేత కార్మికులకు నులు, విక్రయాలకు సంభందించిన రిబెట్ సబ్సిడీ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రులు ఆర్థిక శాఖా మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్ మరియు టీఆర్ఎస్ నేత ఎల్ రమణ.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు అధికారులు ఇబ్బంది పెట్టొద్దని…చేనేత కార్మికుల త్విఫ్ట్ ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. మంత్రి కెటిఆర్ చేనేత కార్మికుల కోసం 70 కోట్లు విడుదల చేశామని.. హుజురాబాద్ లో చేనేత కార్మికుల కోసం కోటి తోబ్బయ్ లక్షలు మంజూరు చేస్తామన్నారు. చేనేత సంఘం కార్మికులకు వచ్చే పెండింగ్ ఉన్న అన్ని రకాల డబ్బులు విడుదల చేస్తున్నామని.. తెలంగాణ వచ్చాక చేనేత కార్మికులు తీసుకున్న అన్ని రకాల అప్పులు మాఫీ చేయించామన్నారు. చేనేత మిత్ర పథకం ద్వారం చేనేత కార్మికులకు సబ్సిడీ ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version