నటి దివ్య నగేష్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ చిన్నది అరుంధతి సినిమాలో జేజమ్మగా నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. దివ్య నగేష్ అరుంధతి సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ సినిమా అనంతరం ఈ బ్యూటీ అనేక సినిమాలలో అవకాశాలను అందుకుంది. తాజాగా ఈ చిన్నది ప్రముఖ కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్ ను ఈనెల 18న వివాహం చేసుకుంది.

ఐదు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న దివ్య నగేష్, అజిత్ కుమార్ కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సింగం పులి, అపరిచితుడు, అరుంధతి లాంటి అనేక సినిమాలలో దివ్య నగేష్ నటించారు. అరుంధతి సినిమాలో తన నటనకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును ఈ చిన్నది కైవసం చేసుకుంది. ప్రస్తుతం దివ్య నగేష్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. వివాహం తర్వాత ఈ చిన్నది ఎప్పటిలానే సినిమాలలో నటిస్తుందో లేదో చూడాలి.