హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాల పైన ఉన్న వైర్లు తెగిపోయాయి. దీంతో వాటన్నిటిని.. క్లియర్ చేసే ప్రయత్నంలో విద్యుత్ అధికారులు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై ఉండే ఇంటర్నెట్ కేబుల్స్ తొలగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనిపై కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఇంటర్నెట్ కేబుల్స్ తొలగించడం పై కేటీఆర్ సీరియస్ అయ్యారు. కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండా కేబుల్ వైర్లను కట్ చేశారని మండిపడ్డారు. లక్షల మంది ఇంటర్నెట్ యూజర్లు దీనికి వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రం హోం కు ఆటంకం కలిగి రోజు వారి జీవితం గందరం గోళం లో పడిందని కూడా చురకలంటించారు. సోషల్ మీడియా బాధితుల ఆవేదనతో నిండిపోయింది… కేబుల్స్ తో సమస్య ఉంటే పద్ధతి ప్రకారం వెళ్లాలని వివరించారు కేటీఆర్. జోకర్‌ను ఎన్నుకుంటే పాలన అని మండిపడ్డారు.