ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.తూర్పుగోదావరి జిల్లాలోన నల్లజర్లో ఆదివారం అర్ధరాత్రి గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటికి నిప్పంటుకోవడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అది గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా యత్నించారు. అయితే, ఆ ఇంట్లో నిద్రిస్తున్న దివ్యాంగుడు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం.
అతన్ని రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. అగ్ని ప్రమాదంల దివ్యాంగుడు డానియేల్ కాలి బూడిదయ్యారు.సమాచార అందుకున్నపోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.అగ్నిప్రమాదంపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.అనంతరం డానియేల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.