దీపావళి ఒక్క రోజు పండుగ కాదు.. ఐదు రోజులూ ఇలా జరుపుకోవాలట..!

-

ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట. అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని.. దీని మూలంగా అమావాస్య ఉండదు.

 

 

కనుక 24న రాతంత్రా అమావాస్య గడియలు వున్నాయి కనుక దీపావళి అక్టోబర్ 24న అయ్యింది. ఆ రోజు పండుగ చేసుకోవాలి. పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా 24న ఉదయం చతుర్దశి వుంది. రాతంత్రా అమవాస్య మాత్రం ఉంటుంది. అయితే చాలా మంది దీపావళిని ఐదు రోజులూ జరుపుకుంటుంటారు. మరి ఐదు రోజులనూ ఎలా జరుపుకోవాలి అనేది చూద్దాం.

మొదటి రోజు ధన్ తేరస్‌:

22 అక్టోబర్ 2022న ధన్ తేరస్‌ వచ్చింది. ధన్ తేరస్‌ నాడు పూజలు చేయడం వలన సంపద కలుగుతుంది. అలానే ఆరోగ్యంగా కూడా వుండచ్చట.

 

రెండవ రోజు నరక చతుర్దశి:

దీన్ని నరక చతుర్దశి లేదా చోటి దీపావళి అంటారు. ఇంట్లో దీపం వెలిగిస్తే నరకానికి సంబంధించిన బాధలు ఉండవట. హనుమాన్ భక్తులు ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. హనుమంతుడు ఈరోజే జన్మించారని అంటారు.

మూడవ రోజు దీపావళి:

వినాయకుడిని, లక్ష్మీదేవిని పూజించడం వలన ఎంతో మంచి కలుగుతుంది. లక్ష్మి దేవికి పూజ చేయడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా దీపావళికి వ్యాపారాలు లక్ష్మీ దేవిని పూజిస్తారు. లక్ష్మీ దేవి ముందు ఆభరణాలు, డబ్బులు వంటివి పెడితే మంచిది. పూజ గదిలో దీపాలని పెట్టడం లేదా లైట్లని పెట్టడం లాంటివి చేయాలి. ఇల్లంతా కూడా దీపాలతో అలంకరిస్తే చాలా మంచిది.

నాల్గవ రోజు గోవర్ధన్ పూజ:

అక్టోబర్ 25 న ఇది వచ్చింది. గోవర్ధన పూజ రోజు గోవర్ధన్ పర్వతం, ఆవుకి పూజలు చేస్తారు.

 

ఐదవ రోజు అన్నా చెల్లెల పండగ:

26 అక్టోబర్ 2022న ఈ ఏడాది వచ్చింది. అన్నా చెల్లెల పండగగా దీన్ని చేసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version