దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి హిందువు ఇంట్లోనూ ఇంటి బయట దీపాలు వెలిగిస్తుంటారు. జ్యోతిని వెలిగించడం వలన చీకట్లను తొలగిస్తుందని అందరికీ తెలుసు. మనలోని అజ్ఞానాన్ని పారద్రోలడానికి సైతం ఒక జ్యోతి అవసరం అవుతుంది. అందుకే దీపావళికి చాలా మంది దీపాలను వెలిగించి కొత్త వెలుగును ఆహ్వానిస్తుంటారు. అయితే, దీపావళి పర్వదినాన ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలని వేద పండితులు, పురోహితులు చెబుతున్నారు.
ఇంటి గడపకు ఇరువైపులా, వంట గది, ధాన్యగారం, తులసికోట, రావిచెట్టు కింద దీపం పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో పాటే ఆలయాలు, మఠాలు, గోశాలలు, వృక్షాలు, ఇంట్లోని ప్రతి మూలలోనూ దీపాలు వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖశాంతులతో మనలోని అంధకారం తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలుగుతుందని వెల్లడించారు.