టామాటో రైతులకు షాక్ తగిలింది.. కిలో రూ.5 కూడా మార్కెట్ లో పలకడం లేదు టామాటో ధరలు. మొన్నటి వరకు కిలో టమాటో కొనాలంటే సామాన్యుడి కంట కన్నీరు వస్తోంది. రోజు రోజుకు టమాటో ధరలు విపరీతంగా పెరిగాయి. టమాటో రేటు సెంచరీ దాటి పోతోందని అందరూ అనుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో కిలో టమాటా ధర 50 రూపాయలను దాటింది.
అయితే..దీపావళి రాగానే.. టామాటో ధరలు… అమాంతం పడిపోయాయి. కిలో రూ.5 కూడా మార్కెట్ లో పలకడం లేదు టామాటో ధరలు. దీంతో టామాటో రైతులకు షాక్ తగిలింది.. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటా ధరలు భారీగా తగ్గిపోయాయి. కిలో ఐదు రూపాయలు కూడా పలకడం లేదట టమోటా ధరలు. జత బాక్స్100 నుండి 150 రూపాయలు మాత్రమే రేటు… పలుకుతోందట. దీంతో ఆందోళనలలో టమోటా రైతులు.. ఉన్నారని చెబుతున్నారు.