డీకే అరుణ: కాళేశ్వరం అవినీతి పై చర్యలు ఏవి..?

-

కాళేశ్వరం అవినీతి గురించి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నారు డీకే అరుణ. సిట్టింగ్ జడ్జితో విచారణ కాలయాపన చేసే యోచనగా ఉందన్నారు. అలానే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చెయ్యండి అన్నారు. అలానే సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ ను కూడా రద్దు చెయ్యాలని అరుణ అన్నారు. జుడిషియల్ ఎంక్వైరీ అంటే కాలయాపన చెయ్యడం అని అన్నారు.

నాణ్యత లేదని, నాణ్యత లోపం వల్లే మెడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం పంపులు మునగడం జరిగాయన్నారు. చర్యలు వెంటనే తీసుకునేలా సీబీఐ విచారణ జరిపించాలి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు వంద రోజుల అడిగారు, ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉండాలి అని అరుణ చెప్పారు. కేంద్రం నిధులు ఇస్తుందనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా…? రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పక వస్తాయి అని, గతంలో కూడా పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇచ్చిందని అరుణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version