కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు : డీకే అరుణ కౌంటర్

నిన్న కేంద్రంపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ నాయకులు డీకే అరుణ కౌంటర్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌… మీడియా సమావేశం లో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌… రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు డీకే అరుణ. ముఖ్యమంత్రి నీ భాష మార్చుకో , లేదంటే ప్రజలు గుణపాఠం చెబుతారని కేసీఆర్‌ కు వార్నింగ్‌ ఇచ్చారు డీకే అరుణ.

కేంద్రం పై కేసిఆర్ లేని పోని ఆరోపణలు చేస్తున్నారని… దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని అబద్దాలు మాట్లాడరని పేర్కొన్నారు. పాలమూరు, రంగారెడ్డి, ఎత్తి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోకుండా పిచ్చికూతలు కూస్తున్నవని… నిన్ను ఎవరైనా తిడితే కేసు పెడతావ్ , ఇద్దరి కేంద్ర మంత్రులను తిట్టిన నిన్ను ఏం చేయాలని నిప్పులు చెరిగారు డీకే అరుణ. హుజురాబాద్ ఓటమి తో ముఖ్యమంత్రి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. తెలంగాణ లో త్వరలో వచ్చేది బీజేపీ పార్టీనేని డీకే అరుణ పేర్కొన్నారు.