తెలంగాణ రాజకీయాల్లో తొలిసారి టీఆర్ఎస్ పార్టీలో వణుకు మొదలైనట్లు కనిపిస్తోంది. ఉద్యమ సమయంలో గానీ..ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక గానీ టీఆర్ఎస్ ఎప్పుడు ప్రత్యర్ధులకు పెద్దగా భయపడలేదనే చెప్పాలి. అసలు ప్రత్యర్ధులని టీఆర్ఎస్ వణికిస్తూ వస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింతగా టీఆర్ఎస్, ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తుంది. ఎప్పుడు కూడా ఓటమి విషయంలో టీఆర్ఎస్ భయపడిన పరిస్తితి లేదు.
కానీ హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత టీఆర్ఎస్‌లో వణుకు మొదలైనట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. అది అలా ఎంతే ఆధిక్యం ఉన్నా సరే భయపడే పరిస్తితి. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న పలు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యర్ధులు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్ స్థానాల్లో కారు షేక్ అవుతుంది. ఈ రెండు చోట్ల స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కు లీడ్ ఉంది. అయినా సరే కారు షేక్ అయ్యే పరిస్తితి.
అందుకే రెండుచోట్ల టీఆర్ఎస్ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులతో క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. లీడ్ ఉన్నా సరే స్థానిక నేతలని గోవా, బెంగళూరు లాంటి సిటీలకు తీసుకెళ్లి క్యాంపులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా రవీందర్ సింగ్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈయనకు ఈటల రాజేందర్ మద్ధతు ఉంది. దీంతో టీఆర్ఎస్ మామూలుగా భయపడటం లేదు. తమ పార్టీ వాళ్ళు కూడా రవీందర్ సింగ్ వైపు మొగ్గుచూపుతారని భయపడి బెంగళూరు తీసుకెళ్లిపోయి క్యాంపు పాలిటిక్స్ చేస్తున్నారు.
అటు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ నిలబడింది. దీంతో అక్కడ కూడా కారు పార్టీ భయపడి.. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులను నేతలు గోవా క్యాంపునకు తరలిస్తున్నారు. అంటే ఆధిక్యం ఉన్నా సరే కారు పార్టీ షేక్ అవుతుందని చెప్పొచ్చు. పైగా తాజాగా స్థానిక కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు గురించి మాట్లాడుతూ… పోతే ఒకటో రెండో పోతాయి. అది పెద్ద సమస్యా? అని చెప్పి మాట్లాడారు. అంటే ఎక్కడో తేడా కొడుతున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఇలా క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు.