సినీ స్టార్స్ కొడుకులకంటే కూతుళ్లకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందా ?

-

సినీజనాలు ఎక్కువగా హీరోల కొడుకుల గురించే మాట్లాడుతుంటారు. ఫ్యూచర్‌ స్టార్‌ అని కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇద్దరు వారసురాళ్లు మాత్రం వారసుల కంటే ఎక్కువ అటెన్షన్‌ గ్రాబ్ చేస్తున్నారు. ఇంతకీ అన్నయ్యలని డామినేట్‌ చేస్తోన్న ఆ ఇద్దరు చెల్లెల్ల పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ ఇద్దరు ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్‌ వీడియో చేశారు. ఓ మైగాడ్ డాడీ పాటలో మెరిశారు. కానీ సోషల్‌ మీడియాలో అయాన్‌ కంటే అర్హకే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ కనిపిస్తున్నారు. దోశ స్టెప్ డైలాగ్ నుంచి మొదలుపెడితే, రీసెంట్‌ అంజలి కవర్‌ సాంగ్‌ వరకు అర్హ హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది.

మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఆల్రెడీ ఒక సినిమాలో యాక్ట్ చేశాడు. ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో చిన్నప్పటి మహేశ్‌ క్యారెక్టర్ చేశాడు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం మహేశ్ కొడుకు కంటే కూతురుకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సితార ప్రతీ యాక్ట్‌ని తెగ లైక్ చేస్తుంటారు మహేశ్ బాబు అభిమానులు.

సోషల్ మీడియాలో గౌతమ్‌ కంటే సితారకే ఎక్కవమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సితారకి 2 లక్షల 28వేలకుపైగా ఫాలోవర్స్ ఉంటే, గౌతమ్‌కి మాత్రం లక్షా 39 వేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఇక సితారకి సొంత యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఒక ఛానల్‌ రన్ చేస్తోంది సితార. ఈ ఛానల్‌కి రెండు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఇలా ఒక పక్క అల్లు అయాన్‌ని అల్లు అర్హ బీట్‌ చేస్తుంటే మరో పక్క గౌతమ్ కంటే ఎక్కువ ఫాలోవర్స సంపాదించుకుంది సితార. ఇలా వీరిద్దరు తండ్రికి తగ్గ వారసురాళ్లు అనిపించుకుంటున్నారని మహేశ్,అల్లు ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version