కరోనా వైరస్ కారణంగా ఎక్కువగా నష్టపోయిన వారిలో వలస కూలీలు చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. వారు ఇప్పుడు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా వలస కూలీల ఇబ్బందులు ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు వలస కూలీల పిల్లల చదువులకు సంబంధించి కేంద్రం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
తిరిగి వచ్చిన వలస కూలీల పిల్లలకు సంబంధించి ప్రైవేట్, ప్రభుత్వ స్కూల్స్ చిన్న చిన్న గుర్తింపు కార్డులు మినహా వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా స్కూల్ లో జాయిన్ చేసుకోవాలి అని సూచించింది. అదే విధంగా వారి టీసీ లు గాని గత క్లాసుల్లో మార్కుల పత్రాలను అడగవద్దు అని స్పష్టంగా చెప్పింది కేంద్రం. ఇది తక్షణమే అమలు చెయ్యాలి అంటూ తమ ఆదేశాల్ల్లో స్పష్టంగా పేర్కొంది.