వారెవ్వా…! కెమెరా ఇల్లు భళా…!

-

నేటి కాలంలో వివిధ రకాల మోడల్స్ తో ఇళ్ళని కట్టుకోవడం చూస్తున్నాం. అయితే ఇవి అన్నీ ఒక ఎత్తయితే ఈ ఇల్లు మరొక ఎత్తు. ఇది కెమెరా కాదండి కెమెరా ఆకారంలో కట్టిన ఇల్లు. నిజంగా ఆశ్చర్య పోయారు కదా…! ఎందుకు కెమెరా ఆకారంలో ఇల్లు కట్టడం జరిగిందని తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్య పోతారు. ఎవరికైనా సరే ఒక రంగం మీద ప్రేమ ఉంటే చాలా వరకు దానిని అభిమానిస్తూ ఉంటారు.

photo house

ఆ రంగం పై కళని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి కర్ణాటక లో ఫోటోగ్రఫీ రంగంలో నుండి పైకి వచ్చాడని భావించి కెమెరా మీద ప్రేమ ఎక్కువగా పెంచుకుని, తన ఇంటిని కెమెరా ఆకారంలో కట్టుకున్నాడు. అయితే ఈ మొత్తం ఇంటిని నిర్మించడానికి గాను రూ. 71,63,048 ఖర్చు కాగ, ఇంట్లో ఉన్న వాటిని కూడా కెమెరా కి సంబంధించిన భాగాలను పోలి ఉంటాయి. చూశారు కదా…! ఇది ఎంత వింతగా ఉందో. లెన్స్, మెమరీ కార్డ్, కెమరా రీల్ ఇలా ప్రతిదీ కూడా ఇలా వివిధ ఆకారాన్ని పోలి ఉంటుంది.

వీటితో పాటు గోడలు పై కప్పులు కూడా కెమెరా యొక్క వివిధ భాగాలని పోలి ఉండడం నిజంగా అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఇల్లు బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. అతని పేరు రవి. అయితే అతని కుమారుల పేర్లు ఏంటో తెలుసా…? కెనాన్, ఎప్సన్ అయితే కెమెరా మీద ఇష్టంతో ఈ పేర్లు పెట్టాడు. కెమెరాలను ఎంతగానో ప్రేమించే అతను ఈ విధంగా ఇంట్లో అంతా కెమెరా మయం చేశాడు. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రేండింగ్ గా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version