చస్తే భార్యతో చావడమే గాని విడాకులు మాత్రం ఇవ్వొద్దు అక్కడ…!

-

కరోనా వైరస్ పుట్టిన ఊహాన్ నగరం కంటే ఎక్కువగా ప్రభావితం అవుతున్న నగరం న్యూయార్క్. అది అమెరికా ఆర్ధిక రాజధాని అక్కడ కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. ఆ నగరంలోనే దాదాపు 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. అక్కడి గవర్నర్ కూడా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అర్ధం కాక భయపడే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎవరైనా సరే ఇప్పుడు న్యూయార్క్ నగరంలో పెళ్లి చేసుకోలేరు. అలాగే విడాకులకు కూడా అప్లై చేసుకోలేరు. మార్చి 23న న్యూయార్క్ కోర్టులు సంచలన నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో అక్కడ అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తారు. ప్రాధాన్య కేసుల లిస్టును శుక్రవారం కోర్టులు విడుదల చేసాయి. వాటిల్లో పెళ్లిళ్లు, విడాకులు పేర్కొనలేదు. అంటే పెళ్లి చేసుకోలేరు విడాకులు ఇచ్చుకోలేరు. చస్తే భాగస్వామి తో చావడమే గాని…

విడాకులు మాత్రం విచారించే అవకాశం లేదు. న్యూయార్క్ మ్యారేజ్ బ్యూరో మార్చి 20నే మూసి వేసారు. గృహ హింస లాంటి కేసులైతే వెంటనే విచారణకు స్వీకరిస్తారు. దీనిపై అక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం గోల అంటూ అక్కడి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హత్యల వరకు అక్కడ కొన్ని బంధాలు వెళ్తున్నాయని కాబట్టి ఆలోచించాలి అని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version