సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ పై పోరాటం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఆయన శనివారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్… ఇది ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని, లాక్ డౌన్ ని ఎవరూ కూడా ఉల్లంఘించవద్దని సూచించారు. కొన్ని సంఘటనలు దురదృష్టవ శాత్తు జరుగుతూ ఉంటాయని అన్నారు.
దానిని ఎవరూ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదని జగన్ అభిప్రాయపడ్డారు. కరోనాపై వ్యతిరేకంగా సమిష్టి పోరాటం చేస్తున్నామని అన్నారు. కొన్ని ఘటనలపై ఎవరి మీద నిందలు వేయకండి అని కోరారు.రేపు కులాలకు మతాలకు అతీతంగా అందరూ దీపాలు వెలిగించాలని జగన్ సూచించారు. కరోనాపై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఇది అని అన్నారు.
మనం అంతా ఒక్కటే అనే సందేశాన్ని చాటుదామని జగన్ కోరారు. ఢిల్లీ ఘటన గురించి మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని, ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో అయినా ఇలాంటి జరుగుతూ ఉంటాయని అన్నారు.