చేదుగా ఉన్నా కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందచ్చని చాలా మంది రెగ్యులర్ గా కాకరకాయల్ని తింటూ ఉంటారు. కాకరకాయతో మనం రకరకాల రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. అయితే నిజానికి కాకరకాయ వల్ల లాభాలు ఉన్నాయి. కానీ ఈ తప్పులు చేస్తే మాత్రం కొన్ని రకాల సమస్యలు తప్పవు. మరి ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం. ఆరోగ్య నిపుణులు ఈ తప్పులను అస్సలు చేయదని అంటున్నారు కాకరకాయని తీసుకునేటప్పుడు కొన్ని కాంబినేషన్స్ అసలు తీసుకోకూడదు.
పాలతో కాకరకాయని అసలు తీసుకోవద్దు. పాలతో కాకరకాయను తీసుకుంటే ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. కాకరకాయ పాలు కలిపి తీసుకుంటే కడుపునొప్పి, కాన్స్టిపేషన్, బర్నింగ్ సెన్సేషన్ వంటి సమస్యలు తప్పవు. మామిడి పండు తో కూడా కాకరకాయని అసలు తీసుకోకూడదు. మామిడిపండు కాకరకాయ కలిపి తీసుకుంటే నష్టాలు తప్పవు.
అందులో ఇది వేసవికాలం మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి. అటువంటప్పుడు మీరు రెండిటిని కలిపి తీసుకుంటే వికారం, వాంతులు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ముల్లంగి కాకరకాయని కలిపి తీసుకోకూడదు. ఈ రెండు కలిపి తీసుకుంటే జలుబు, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి కాకరకాయని తీసుకునేటప్పుడు ఈ తప్పులని అసలు చేయకుండా చూసుకోండి ఇలా ఈ తప్పులను చేస్తే సమస్యలను ఎదుర్కోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.