ఆహారానికి సంబంధించిన తప్పులను మనం ఎప్పుడు చేయకూడదు. మనం తీసుకునే ఆహారం మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. మంచి ఆహారాన్ని ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే కచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. సాయంత్రం పూట చాలామంది స్నాక్స్ ని తీసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి హాని చేసే వాటిని తీసుకుంటూ ఉంటారు. సాయంత్రం పూట చేసే చిన్న చిన్న తప్పులు వలన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. సాయంత్రం పూట తీసుకునే ఆహారం విషయంలో ఇలాంటి తప్పులు అసలు చేయకండి.
సాయంత్రం పూట జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకండి. బాగా ఎక్కువ పంచదార వేసిన టీ, కాఫీ వంటి వాటిని కూడా తీసుకోవద్దు. క్యాలరీలు తక్కువగా ఉండే వాటిని మాత్రమే తీసుకోండి. టీ తీసుకునేటప్పుడు అస్సలు బిస్కెట్లను కానీ ఫ్రై చేసిన ఆహార పదార్థాలని కానీ తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. నాలుగు గంటలకి చాలామంది టీ తాగుతూ ఉంటారు అలాంటప్పుడు టీతో పాటుగా ఆహార పదార్థాలను తీసుకోవద్దు.
పండ్ల రసాలను తీసుకునేటప్పుడు కూడా తప్పులు చేస్తారు చాలామంది. పండ్లలో షుగర్ ఫ్యాక్టోస్ ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. దీంతో యూరిక్ ఆసిడ్ ఎక్కువ అవుతుంది. పండ్లను తీసుకునేటప్పుడు నట్స్, నట్స్ బటర్ తో కలిపి తీసుకోండి. అలానే సాయంత్రం పూట తీసుకునేటప్పుడు చాలామంది పుచ్చకాయ మొదలైన వాటిని తీసుకుంటూ ఉంటారు. షుగర్ ఎక్కువగా ఉంటుంది. పండ్లని తీసుకునేటప్పుడు కూరగాయలతో పాటు తీసుకోవడం మంచిది.
పండ్లను తీసుకున్నప్పుడు మీరు క్యారెట్ ని తీసుకోండి. టీ కాఫీ ని తీసుకునేటప్పుడు మఖాన వంటివి లైటుగా ఉండేవి తీసుకుంటూ ఉండండి. లేదంటే లైట్ గా ఒక చపాతి శాండ్విచ్ వంటివి తీసుకోండి. కేవలం టీ ని మాత్రమే తీసుకుంటే ఎసిడిటీ సమస్య కలగవచ్చు. పైగా పంచదార ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి అలానే సాయంత్రం పూట మీరు ఏవైనా తినాలని అనుకుంటే సలాడ్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.