టిడిపి, కొన్ని దుష్టశక్తులు మూడు రాజధానులను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. వికేంద్రీకరణ మా పార్టీ విధానం అని.. అదే ఏజెండాతో 2024 ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజాధనం తీసుకువచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అని వ్యాఖ్యానించారు.
రాజధాని పేరుతో ఆర్థికంగా లబ్ధి పొందిన వారే తప్ప నిజమైన రైతులు ఎవరు ఉద్యమంలో లేరని ఆరోపించారు మంత్రి బొత్స. రైతులు టెంట్ వేసుకొని కూర్చోవడం ఉద్యమ స్ఫూర్తా? అని ప్రశ్నించారు. ఇక ముందస్తు ఎన్నికలపై బొత్స స్పందిస్తూ.. ఐదేళ్లు ప్రజలు పాలించమని అవకాశం ఇచ్చారని.. ఆ అవకాశాన్ని వదులుకొని ముందస్తుకు ఎందుకు వెళతామని ప్రశ్నించారు.