నవరాత్రుల్లో వీటిని అస్సలు తినకూడదు…!

-

చాలా మంది హిందువులు నవరాత్రి పూజలు చేస్తూ ఉంటారు. అయితే నవరాత్రి సమయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వేటిని ఖచ్చితంగా ఆచరించాలి..? అయితే మరి నవరాత్రుల సమయంలో ఏవి అనుసరించాలి..? వేటి వల్ల మనకి మంచి కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. నవరాత్రి సమయంలో ఉల్లిల్లి, వెల్లుల్లి అస్సలు తీసుకోకూడదు.

అలానే మాంసాహారులు మాంసాన్ని తీసుకోకూడదు. నవరాత్రి కాదు ఏ పండగ అయినా సరే ఇది కచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. ప్రతీ ఒక్క మనిషిలో ఉండే మూడు గుణాలు గురించి కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ గుణాలనే త్రిగుణాలు అని అంటారు. అయితే ఈ మూడు గుణాలు కారణంగానే జీవుడు శరీరం లో బంధించి ఉన్నాడని భగవద్గీత అంటుంది.

సత్వగుణం:

ఇది జ్ఞానం పై ఆసక్తిని కలిగిస్తుంది మన మనసుని దైవకార్యం వైపు మళ్ళించడానికి ఇది తోడ్పడుతుంది. మృదువుగా మాట్లాడేలా చేస్తుంది.

రజోగుణం:

ఇది ఎక్కువగా ఉంటే మనిషి ప్రశాంతంగా ఉండలేరు. ఆలోచనలు ఆందోళన సంతృప్తి వంటివి ఉంటాయి.

తమోగుణం:

ఇది అధికంగా ఉంటే నిద్ర సోమరితనం ఎక్కువగా ఉంటాయి. తిండి మీద ధ్యాస ఉంటుంది.

అయితే మనం తీసుకొనే ఆహారం బట్టి మన గుణాలు ఉంటాయి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మంచిది. సాత్వికాహారం అంటే స్వచ్ఛమైన శాఖాహారం. ఇలా ఉండడం వల్ల వారిలో ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. శుభకార్యాలు, పండగ సమయంలో సాత్వికాహారం అందుకే తీసుకోవాలి అని అంటారు. మధ్యపానం, ధూమపానం వలన రజోగుణం ఎక్కువైపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news