ఆ నలుగురికి ఉరి వద్దు.. రెండు బెత్తం దెబ్బలు కొట్టండి.. పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో

-

అసలే కోతి.. ఆపై కల్లు తాగింది.. ఇంతలో తేలు కుట్టింది.. అదీ చాలదన్నట్లు దెయ్యం కూడా పట్టింది.. ఇక ఆ స్థితిలో దాని ప్రవర్తన ఎలా ఉటుందో ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. ఎదురుగా వచ్చే వారికి చుక్కలు చూపిస్తుంది.. ఏం చేస్తుందో ఓ పట్టాన సరిగ్గా అర్థం కాదు.. అవును.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. ఏపీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనో లేదా మరే ఇతర కారణం చేతనో తెలియదు కానీ.. ఆయన ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకే రివర్స్ కొడుతున్నాయి.

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతున్నమని సీఎం జగన్ ప్రకటించగానే.. ఏ మాత్రం ఆలోచించకుండా.. తెలుగును నిర్లక్ష్యం చేస్తారా.. అంటూ టీడీపీ గగ్గోలు పెట్టింది. ఆ తరువాత వైసీపీ ప్రజాప్రతినిధులు .. మీ పిల్లలు చదువుతున్నది ఇంగ్లిష్ మీడియమా, తెలుగు మీడియమా, పేదప పిల్లలకు ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలను అందించే ఇంగ్లిష్ మీడియం వారికి అవసరం లేదా.. అని కౌంటర్ వేసే సరికి.. అటు టీడీపీతోపాటు ఇటు పవన్ కల్యాణ్ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. తాము ఇంగ్లిష్ మీడియానికి అనుకూలమే అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఆ తరువాత ఇప్పుడు దిశ హత్యోదంతంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

దిశ హంతకులను ఉరి తీయడం, మర్మాంగాలను కోసి వేయడం వంటి పనులు కాకుండా వారిని రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని పవన్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన స్పృహలో ఉండే ఈ వ్యాఖ్యలు చేశారా..? అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఓ వైపు అత్యాచార నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. దానికి బదులుగా ఆ నరరూప రాక్షసులను కేవలం రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని పవన్ అనడం వివాదాస్పదమవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు ఈ విషయంపై ఘాటుగానే స్పందిస్తున్నారు. మరి పవన్ ఈ వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version