ఆత్మహత్య చేసుకున్న రోబో.. ఏమంత కష్టంవచ్చిందో..!

-

జీవితంపై విరక్తి చెంది, కష్టాలను, బాధలను భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు.. ఆత్మహత్య కేవలం మనుషులు మాత్రమే చేసుకుంటారు కదా..! కానీ మొదటిసారి రోబో ఆత్మహత్య చేసుకుంది. రోబో ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సంఘటన దక్షిణ కొరియాలో జరిగంది.

రోబో సూపర్ వైజర్​గా పిలవబడే ఓ మర యంత్రం గుమీ నగరంలోని సిటీ హాల్ ఆఫీసులో సేవలు అందిస్తోంది. 2023 ఆగస్టు నుంచి పని చేస్తోంది. ఆదర్శ ఉద్యోగిగానూ ప్రశంసలు అందుకుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ప్రతిరోజు ఆఫీసులో పని చేస్తుంది. అయితే ఈ రోబో రీసెంట్​గా ఉద్దేశపూర్వకంగానే మెట్ల మీద నుంచి దూకినట్లు కథనాలు వచ్చాయి. ఇలా దూకే ముందు ఆ రోబో విచిత్రంగా ప్రవర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధిక పనిభారం వల్ల ఇలా జరిగిందని కొంతమంది చెబుతుంటే.. యంత్రంలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని మరికొంతమంది నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఘటననే తొలి రోబో ఆత్మహత్యగా స్థానిక మీడియాతో పాటు సోషల్ మీడియాలో చెబుతున్నారు.

రోబో ఆత్మహత్య

చాలా మంది రోబోకు ఎమోషన్స్​ ఉండవు, అలాంటిది రోబో ఆత్మహత్యకు ఎలా పాల్పడుతుందని అంటున్నారు..అవును అది నిజమే కదా..? రోబో కదలికల కోసం దోహదపడే నేవిగేషన్​లో లోపాలు లేదా ప్రోగ్రామింగ్​లో బగ్, సెన్సార్ల వైఫల్యం వల్ల రోబో ఇలా విచిత్రంగా ప్రవర్తించి ఉండొచ్చని అంటున్నారు. అందుకే మెట్లపై నుంచి దూకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

కాగా, క్యాలిఫోర్నియాకు చెందిన బేర్ రొబోటిక్స్ అనే రోబో వెయిటర్ స్టార్టప్ సంస్థ ఈ రోబోను తయారు చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ ముక్కలైన రోబో భాగాలను సేకరించి దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే ఇలా ఎందుకు జరిగిందో పూర్తి సమాచారాన్ని విశ్లేషించి చెబుతామని పేర్కొంది. ప్రపంచం మొత్తంలో దక్షిణ కొరియాలోనే అత్యధికంగా రోబోల సేవలను వినియోగిస్తున్నారు. అక్కడ ప్రతి 10 మంది ఉద్యోగులకు కలిపి ఒక పారిశ్రామిక రోబో పనిచేస్తోందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version