భోజనం తిన్న తర్వాత ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు…!

-

సాధారణంగా చాలా మందికి భోజనం తినేసిన తర్వాత ఏదో ఒకటి తినడం అలవాటు ఉంటుంది. అయితే భోజనం చేసిన తర్వాత కచ్చితంగా ఈ తప్పులు చెయ్యడం మంచిది కాదని నిపుణులు చెప్పడం జరిగింది. కాబట్టి భోజనం తిన్న తర్వాత ఈ తప్పులు అస్సలు చెయ్యట్లేదు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా వాటి కోసం చూసేద్దాం.

టీ, కాఫీ:

భోజనం తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. అలానే ఎనీమియా, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి భోజనానికి గంట ముందు లేదా వెనుక కూడా వీటిని తీసుకోవద్దు.

పండ్లు తినడం:

భోజనం తినేసిన తర్వాత పండ్లు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత కడుపు నిండుగా ఉంటుంది. ఆ తర్వాత కనుక పండ్లు తింటే అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని కూడా తీసుకోవద్దు.

చల్లటి నీళ్లు తాగడం:

ఫ్రిజ్లో నుంచి తీసిన చల్లటి నీళ్ళు భోజనం తర్వాత తాగడం మంచిది కాదు. ఇలా తాగడం వల్ల
డైజేషన్ ప్రక్రియ స్లో అయిపోతుంది. దీంతో జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి చల్లని నీళ్లు కూడా తాగద్దు.

స్మోకింగ్:

స్మోకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా తినేసిన తర్వాత వెంటనే స్మోకింగ్ చేయడం వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్య వస్తుంది. తద్వారా ఇది అల్సర్ కి కూడా దారి తీస్తుంది.

స్నానం చేయడం:

తినేసిన వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మీద ప్రభావం చూపుతుంది.

నిద్రపోవడం:

తిన్న తర్వాత నిద్ర పోవడం కూడా మంచి అలవాటు కాదు. హార్ట్ బర్న్, నిద్రలేమి సమస్యలు, గురక వంటి సమస్యలు వస్తాయి.

వ్యాయామం చేయడం:

తిన్నాక వ్యాయామం అస్సలు చేయొద్దు. అలానే వ్యయం చేసాక తినడం వల్ల జీర్ణప్రక్రియ స్లో అయిపోతుంది అలానే డయేరియా వికారం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version