ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను ముస్లింలు తీసుకోకండి.. ముస్లింలకు ఇమామ్‌ అభ్యర్థన..

-

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌పై తాజాగా వివాదం నెలకొంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఇమామ్‌ ఆ వ్యాక్సిన్‌ను ముస్లింలు తీసుకోకూడదని కోరారు. ఇమామ్‌ సూఫ్యాన్‌ ఖలీఫా ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన ఫాలోవర్లను అభ్యర్థించారు. డెయిలీ మెయిల్‌ కథనం ప్రకారం.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్‌ను ముస్లింలు తీసుకోకూడదని, తీసుకుంటే సిగ్గుచేటని అన్నారు.

కాగా 1970లలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అబార్షన్‌ చేయబడిన పిండం నుంచి కణాలను సేకరించి వ్యాక్సిన్లను తయారు చేయడం మొదలు పెట్టింది. ముస్లిం సిద్ధాంతాల ప్రకారం ఇలా చేయకూడదని, కనుక ఈ పద్ధతుల్లో తయారు చేసే వ్యాక్సిన్లను తీసుకోకూడని ఖలీఫా అన్నారు. అయితే మరోవైపు కొందరు క్యాథలిక్‌లు కూడా ఇలా చేయడం సరికాదని, చట్ట విరుద్ధమని అన్నారు. మతానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఆ పద్ధతిలో తయారు చేసిన వ్యాక్సిన్‌ను తీసుకోవద్దని అన్నారు.

అయితే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన కోవిడ్‌ వ్యాక్సిన్‌కు గాను ఆస్ట్రేలియా ఇప్పటికే ఆస్ట్రాజెనెకా సంస్థతో భాగస్వామ్యం అయింది. ఇదే విషయంపై ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్యాథలిక్‌ ఆర్క్‌బిషప్‌, సిడ్నీ ఆంగ్లికన్‌ ఆర్క్‌బిషప్‌, గ్రీక్‌ ఆర్థోడాక్స్‌ ఆర్క్‌బిషప్‌లు ఆ దేశ ప్రధానికి లేఖ రాశారు. ఆస్ట్రాజెనెకాతో వ్యాక్సిన్‌ కోసం కుదుర్చుకున్న డీల్‌పై పునరాలోచించాలని కోరారు. వ్యాక్సిన్‌ తయారీకి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభ్యంతరకర, అసహజమైన విధానాలను అనుసరిస్తుందని, అబార్షన్‌ కాబడిన పిండం నుంచి సేకరించిన కణాలను అందుకు వాడుతారని, కనుక వ్యాక్సిన్లను తీసుకోకముందే ఈ విషయంపై ఆలోచన చేయాలని అన్నారు. కాగా కొందరు మాత్రం యావత్‌ ప్రపంచం కరోనా బారిన పడి చనిపోతుంటే ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ తీసుకోవాలని, దానికి మతం రంగు పులమొద్దని అంటున్నారు. దీనిపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఇంకా స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version