శని త్రయోదశి నాడు ఇలా చేస్తే ధన వర్షం కురుస్తుంది.. ఏ సమస్యలు ఉండవు..!

-

శని దేవుడు న్యాయదేవుడు. ఈయన క్రమశిక్షణ నేర్పుతారు. అలాగే కర్మ ఫలితాలని ఇస్తారు. శని దేవుడు మన జాతకంలో మంచి స్థానంలో ఉన్నట్లయితే మనకి మంచి ఫలితాలు వస్తాయి. అదే చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు వస్తాయి. కొన్ని కొన్ని సార్లు శని ప్రభావం వలన ఊహించని ఫలితాలు వస్తాయి. మంచి జరుగుతుంది. అదే ఒక్కోసారి తట్టుకోలేని బాధలు వస్తాయి. శని దేవుని అనుగ్రహం కలగాలంటే శని త్రయోదశి నాడు ఇలా చేస్తే మంచిది. శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది..? ఆ రోజు ఏం చేస్తే మంచిది వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఈసారి శని త్రయోదశి డిసెంబర్ 28న వచ్చింది. శని త్రయోదశి తెల్లవారుజామున 2:26 గంటలకి మొదలవుతుంది. మళ్ళీ డిసెంబర్ 29 ఉదయం 3:02 గంటలకు ఇది ముగుస్తుంది. శివుడికి శని త్రయోదశి చాలా ఇష్టం. శని త్రయోదశి ప్రతికూల ప్రభావాలతో బాధపడే వాళ్ళకి చాలా విశిష్టమైన రోజు. ఈరోజు ఇలా శని దేవుడుని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి. శని దేవుడు సంతోషిస్తాడు. శని దేవుని కటాక్షం కోసం ఇలా చేయాలి. శని దేవునికి నలుపు రంగు అంటే ఇష్టం.

నల్లటి దుస్తులు ధరిస్తే మంచిది. పడమర ముఖంగా కూర్చుని నల్ల నువ్వుల్ని నీళ్లతో వినాయకుడికి సమర్పించాలి. శని దేవుడికి ఇలా పూజలు చేస్తే ఇష్టం. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శని మంత్రాన్ని జపించాలి ఎవరికైనా పేదలకి నల్ల నువ్వులు కానీ నల్లటి వస్త్రాలు కానీ ఇనుప వస్తువుల్ని కానీ దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శనిదేవుని ఆశీస్సులు, అనుగ్రహం కలగాలంటే శని త్రయోదశి నాడు ఇలా ఆరాధించండి. శనిదేవుని పూజ సాధ్యం కాకపోతే నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు, నువ్వుల నూనె తీసుకుని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి పూజ చేయొచ్చు. ఇలా చేయడం వలన ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version