అందరితో చర్చించిన తర్వాతే ధరణిని రద్దు చేశాం – సీఎం రేవంత్

-

ధరణి పోర్టల్ తో రైతుల సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. గాదే శ్రీధర్ రాజు ద్వారా డేటాను విదేశాలకు పంపించారని పేర్కొన్నారు. అక్కడ వాళ్ళు ఒక్క క్లిక్ కొడితే మన సమాచారం అంతా నాశనం అవుతుందని.. ఇక్కడి సర్వర్లు కూడా క్రాష్ అవుతాయని తెలిపారు.

అందుకే మేము అధికారంలోకి రాగానే ఎంతోమంది నిపుణులు, మేధావులు, రైతు నేతలతో చర్చించి ధరణిని రద్దు చేశామని వెల్లడించారు.భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ధరణి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక ఫార్ములా ఈ – రేస్ పై స్పందించిన సీఎం రేవంత్.. దీనిపై బీఎసీలో ఎందుకు చర్చించలేదన్నారు.

ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులను తాను కలిశారని.. కేటీఆర్ తో చీకటి ఒప్పందం ఉందని వాళ్లే తనకు చెప్పారన్నారు. వాళ్లని కలిసిన తర్వాతే ఈ స్కామ్ గురించి తెలిసిందన్నారు. వీళ్ళ మధ్య 600 కోట్లకు ఒప్పందం జరిగిందని.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ ఆర్థిక నేరాన్ని 55 కోట్లకే ఆపామన్నారు. ఫార్ములా ఈ – రేస్ పై చర్చకు తాము సిద్దమని.. అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీస్ కి కూడా వెళతానని అన్నారు రేవంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version