“ధరణి” రైతులను తమ భూములకు దూరం చేసింది – సీఎం రేవంత్

-

బీఆర్ఎస్ సభ్యులు సభలో చర్చను పక్కదారి పట్టించేలా చూస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సభా మర్యాదలకు ఉల్లంఘన కలిగించి సభాపతి పైనే దాడి చేస్తామన్న ధోరణిలో బిఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కూడా భూమి అన్నారు.

కానీ గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి మాత్రం రైతులను వారి భూములకు దూరం చేసిందన్నారు. ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చాక అనేక అక్రమాలు జరిగాయి అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాల్లోని సంస్థ చేతికి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారని అన్నారు సీఎం రేవంత్. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జిన్ హైలాండ్స్ వంటి దేశాలకు రైతుల సమాచారం వెళ్లిందని తెలిపారు.

ధరణి పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్ళినా సీఈఓ గా గాదే శ్రీధర్ రాజే ఉన్నారని పేర్కొన్నారు. శ్రీధర్ రాజు ద్వారా విదేశాలకు సమాచారాన్ని పంపించారని ఆరోపించారు. అత్యంత సున్నితమైన సమాచారాన్ని విదేశీయుల చేతిలో పెట్టారని.. ఈ తీవ్రమైన నేరానికి పాల్పడిన బాధ్యులకు తప్పకుండా శిక్ష పడాలన్నారు. విదేశాలకు వెళ్లి వివరాలు ఇవ్వాలని కోరిన వారు సహకరించడం లేదని తెలిపారు సీఎం రేవంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version