హరీష్ రావుని కేసీఆర్ కొరడాతో కొడతాడు – రేవంత్ రెడ్డి

-

ఎమ్మెల్యే హరీష్ రావు ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొరడాతో కొడతాడని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నేను హరీష్ రావు గారి బాధను అర్థం చేసుకోగలనని అన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు అల్లరి చేసి చొక్కాలు చించుకోకపోతే.. ఇంటికి వెళ్లిన తరువాత కొరడా దెబ్బలు ఉంటాయని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో నువ్వు ఏం చేస్తున్నావని హరీష్ రావు ని కేసీఆర్ అడుగుతారని.. కొడుకు విషయంలో కెసిఆర్ సీరియస్ గా ఉంటారని అన్నారు. కొడుకును కాపాడుకునేందుకు హరీష్ రావు ని కెసిఆర్ కొరడాతో కొడతాడని అన్నారు. కొన్నిసార్లు కొరడా దెబ్బలు తినాల్సి వస్తుందని అన్నారు.

నిన్న హరీష్ రావు అడిగితేనే ఔటర్ రింగ్ రోడ్డుపై తాము విచారణ వేశామని అన్నారు రేవంత్. కావాలని హరీష్ రావు కేటీఆర్ ని ఇరికించాడని మీ కుటుంబంలో పంచాయతీలు ఉండవచ్చునని అన్నారు. సహజంగా కుటుంబం అన్న తర్వాత ఇటువంటి చిన్నచిన్న సమస్యలు ఉంటాయని చమత్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version