పెన్షన్ ని మీరు తీసుకుంటున్నారా..? అయితే మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి. అలానే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC పాలసీ ఉంటే కూడా తప్పక మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పనులను మీరు తప్పక సమయానికి పూర్తి చేసుకోవాలి. లేదు అంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైగా పెన్షన్ కూడా రాదు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఇప్పటికే రెండు సార్లు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించడానికి కేంద్రం గడువుని ఎక్స్టెండ్ చేసింది. అయితే ఇది ఫిబ్రవరి 28తో ముగిసిపోనుంది. కనుక ఎవరైనా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించకపోతే ఆ పని చేయడం మంచిది. ఒకవేళ కనుక ఆ పని పూర్తి కాలేదు అంటే పెన్షన్ రాదు.
ఒకవేళ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇవ్వకపోతే ఇబ్బంది పడాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతనికి పెన్షన్ మంజూరు చేయాలంటే సంబంధిత కార్యాలయం ఆ ఉద్యోగిని లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని చెప్పింది. అప్పుడే పెన్షన్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే ఎల్‌ఐసీ పాలసీ కలిగిన వారు కచ్చితంగా వారి పాన్ నెంబర్‌ను పాలసీతో అప్‌డేట్ చేసుకోవాలి. లేదు అంటే ఇబ్బందులు తప్పవు. ఎల్‌ఐసీ పాలసీ కలిగిన వారు కచ్చితంగా వారి పాన్ నెంబర్‌ను పాలసీతో అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి.