ఇలా సులభంగా తొలి చూపుతోనే.. లవ్ లో పడేయండి..!

-

ప్రేమలో పడేయడం అంత ఈజీ కాదు. చాలా మంది ప్రేమించిన వ్యక్తులు వెనకాల అలా తిరుగుతూ ఉంటారు. అయినా కూడా ప్రేమ లో పడేయడంలో విఫలమవుతుంటారు కానీ ఇలా కనుక చేస్తే ఫస్ట్ సైట్ లోనే ఫిదా చేసేయొచ్చు. మీరు ప్రేమించిన వ్యక్తిని ప్రేమ లో పడేయాలంటే ఇంప్రెస్ చేసే విధంగా మీరు ఉండాలి. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మీరు ఫిదా చేయాలనుకుంటే మొదట మీ స్టైల్ ని మార్చండి. మీరు ఎలాంటి బట్టలు అయితే వేసుకుంటున్నారో అది మీకు సూట్ అయ్యే విధంగా ఉండాలి.

love failure

లూజ్ గా టైట్ గా దుస్తులు ఉండకూడదు. మీకు బాగా సెట్ అయ్యేలాగ ఫిట్ అయ్యేలాగ ఉండాలి. అప్పుడు ఆకర్షణీయంగా కనబడతారు. లుక్ ని మరింత అందంగా మార్చడానికి చేతికి వాచ్ ని ధరించండి. స్మార్ట్ స్పోర్ట్స్ వాచ్ ఏది సెట్ అవుతుంది అనుకుంటే అటువంటి వాచ్ ని ధరించండి. ఇది కూడా ఆకర్షణీయంగా కనపడేందుకు సహాయపడుతుంది. మీరు వేసుకునే దుస్తులు మీ రంగుకి సెట్ అయ్యే విధంగా ఉండాలి అంటే స్కిన్ టోన్ కి సెట్ అయ్యేలాగా ఉండాలి. అది మీకు సెట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత మీరు వేసుకుని వెళ్ళండి.

షర్ట్ చాలా సింపుల్ గా ఉండేలా చూసుకోండి చాలామంది ప్లైన్ షర్ట్స్ ని ఇష్టపడుతూ ఉంటారు బాడీ ఫిట్ గా ఉంటే మంచి లుక్ వస్తుంది. జీన్స్ వేసుకున్నట్లయితే లూజ్ గా కాకుండా మీకు ఫిట్ అయ్యే విధంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోండి. అలానే మీ భాష చాలా ముఖ్యము. మంచి పదాలను ఉపయోగించండి. చాలా మంది వాళ్లకి నచ్చిన రీతిలో మాట్లాడుతూ ఇంప్రెషన్ ని చెడగొడుతూ ఉంటారు అలా కాకుండా ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడండి. అప్పుడు కచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడతారు. హెయిర్ స్టైల్ కూడా చాలా ముఖ్యం మీ హెయిర్ స్టైల్ ని కూడా చూసుకోండి ఇలా ఈ చిట్కాలని మీరు కనుక ఫాలో అయ్యారంటే చక్కగా అందంగా కనపడతారు. పైగా ఈజీగా ప్రేమలో పడేయొచ్చు మీరు ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version