శతాబ్దాలుగా మహిళలు వాటిని భరించాల్సిందేనా.. ఉర్ఫీ జావెద్..!

-

బాలీవుడ్ సోనాలి కులకర్ణి భారతీయ మహిళలపై చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనానికి దారితీస్తున్నాయి ప్రస్తుత అమ్మాయిలు సోమరిపోతులుగా తయారవుతున్నారని.. ఆమె ఘాటు వ్యాఖ్యలు చేయడం మరింత వైరల్ గా మారుతుంది.. అయితే ఆమె వ్యాఖ్యల పట్ల ఇప్పుడు మరో నటి ఉర్ఫీ జావెద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచి సంపాదన ఉన్న భర్త కావాలని కోరుకోవడంలో తప్పు లేదని తెలిపింది. సోనాలి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ పురుషులు శతాబ్దాలుగా స్త్రీలను కేవలం పిల్లలను యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. వారు ఇంకెంత కాలం ఇవన్నీ భరించాలి అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది..

అంతేకాదు ఉర్ఫీ తన ట్వీట్ లో రాస్తూ ఆధునిక మహిళలు.. తమ పనితో పాటు ఇంటి పనులను కూడా చేస్తున్నారు అలాంటి వారిని మీరు సోమరిపోతులని పిలుస్తున్నారా..? మంచి సంపాదన ఉన్న భర్తను కోరుకోవడంలో తప్పేంటి ? శతాబ్దాలుగా పురుషులు స్త్రీలను పిల్లలను కనే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు.. వివాహానికి ప్రధాన కారణం కట్నం.. మహిళలు కట్నం అడగడానికి భయపడకండి.. అవును మీరు చెప్పింది నిజమే.. మహిళలు పని చేయాలి కానీ అది అందరికీ లభించని ప్రత్యేకమైన హక్కు.. అంటూ పోస్ట్ చేసింది.

ఇక ఊర్ఫీ చేసిన ఈ కామెంట్లకు ప్రతి ఒక్కరూ స్పందిస్తూ నిజంగా ఈ కాలం మహిళల సోమరిపోతులు కాదు శతాబ్దాలుగా వారు తమ పనులు చేసుకుంటూనే కుటుంబాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. మహిళలేని ఇల్లు అసలు ఇల్లే కాదు అంటూ నేటిజన్లు కూడా ఉర్ఫీకి మద్దతు పలుకుతూ సోనాలి చేసిన కామెంట్లను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news