వేసవి కాలం వచ్చింది అంటే చాలా జానాలు చల్లని వస్తువులను తీసుకొవాలని ఆసక్తి చూపిస్తున్నారు.. జ్యూస్ లు, పానీయాలను, కొబ్బరి బోండాలు ఎక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ జనాలు మాత్రం ఎక్కువగా చల్ల చల్లని ఐస్ క్రీమ్ ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఐస్ క్రీమ్ లు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే చల్లగా ఉంది, రుచి బాగుంది కదా అని పొట్ట నిండా తినాలని అనుకుంటే మాత్రం మీ పని గోవిందానే..
లేని పోనీ అనార్యోగ సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..సాదారణంగా ఈ ఐస్ క్రీమ్ లు రుచిగా ఉండటం కోసం చక్కెర, కేలరీలు, కొవ్వులు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా వాడుతున్నారు.. అవి ఎక్కువగా మన శరీరంలోకి వెళితే ఊబకాయం, గుండె జబ్బుల సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కేలరీల శాతం అధికంగా ఉండడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. డైట్ లో ఉన్న వాళ్ళు లేదా అధిక బరువును కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఐస్ క్రీమ్ లకు వీలైనంత దూరంగా ఉండటం మేలని చెప్పాలి..
ఇంకా ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికం అవుతాయి. అందుకే అధిక రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు తీసుకోవద్దని సూచిస్తున్నారు..అందులో షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ పేషెంట్ లకు కొత్త సమస్యలు వస్తాయి.అందుకే వీలైనంత దూరంగా ఉండటం మంచిది.. రుచి బాగుందనో లేదా నచ్చిందని అతిగా తింటే అది ప్రాణాలకే ముప్పు..జాగ్రత్త సుమీ..