మీది జిడ్డు చర్మం అయితే ఈ మేకప్ సాధనాలకి దూరంగా ఉండండి.

-

మీ చర్మ రకానికి సంబంధించి కాకుండా ఏది పడితే దాన్ని వాడడం వలన చర్మం ఇబ్బందులకి గురవుతుంది. అందుకే మీ చర్మం ఎలాంటి రకమో ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి తగిన చర్మ సంరక్షణ సాధనాలను వాడాలి. ముఖ్యంగా జిడ్డు చర్మం కలిగిన వారు కొన్ని రకాల మేకప్ సాధనాలని వాడకూడదు. వాటిని వాడడం వల్ల మీ జిడ్డు తొలగిపోదు సరికదా చర్మం మరింత పాడయ్యే అవకాశం ఉంది. అలాంటి చర్మ సాధనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఒలేయిక్ ఆమ్లం

మీ మేకప్ సాధనాల్లో ఒలేయిక్ ఆమ్లం కలిగిన ప్రోడక్ట్స్ ఉంటే వెంటనే వాటిని తీసేయండి. ఓలియక్ ఆమ్లం ఎక్కువగా ఉన్న కొబ్బరి, కామెల్లియా, హాజెల్ నట్ వంటి సాధనాలమకి దూరంగా ఉండాలి. ఇవి చర్మ రంధ్రాలను అడ్డుకుని చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే రోజ్ షిప్ ఆయిల్ వంటి అధిక లినోలిక్ ఆమ్లం ఉన్న వస్తువులని వాడండి.

ఆక్లుసివ్ ఎమోలియంట్స్

ఇవి చర్మానికి మంచి మేలు చేస్తాయి. కానీ జిడ్డు చర్మం గల వారికి ఏ విధంగానూ పనిచేయవు. ఇవి మరింత జిడ్డుగా మారేలా చేస్తాయి. మందపాటి మాయిశ్చరైజర్లు, లోషన్లు వంటీ వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా నీటితో కూడుకున్నటువంటి మాయిశ్చరైజర్లు వాడడం ఉత్తమం.

ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉండండి.

వీటికి బదులుగా కలబంద రసం వాడడం మంచిది. దీనివల్ల చర్మ రంధ్రాలు తెర్చుకుని ఆరోగ్యంగా ఉంటుంది.

సోడియం క్లోరైడ్ కి దూరంగా ఉండాలి.

ఇది ఎక్కువగా హానికరం కాకపోయినప్పటికీ జిడ్డు చర్మం గల వారు వాడకపోవడమే మంచిది. మనం ఉపయోగించే సబ్బుల్లో ఎక్కువ శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version