ఆవాల ఆకు గురించి తెలుసా..? దృష్టిలోపానికి బెస్ట్‌ మెడిసన్‌..!!

-

ఆకుకూరలంటే..తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర ఇలా మనం రెగ్యులర్‌గా వాడే ఆ నాలుగు ఐదు మాత్రమే గుర్తుకువస్తాయి.. కానీ మీకు ఆవాల ఆకు గురించి తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? వీటిలో ఫైబర్ , విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఈ ఆకు వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటే..
ఆవాల ఆకుల్లోని విటమిన్ కె.. గుండెను కాపాడుతుంది. ఎముకల్ని బలంగా చేస్తుంది. ఇందులోని బైల్ యాసిడ్స్.. జీర్ణ సమస్యల్ని పరిష్కరిస్తాయి. ఆకుల వల్ల కలిగే వేడి వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ బయటకు పోతుంది. సాధారణంగా ఆకుకూరలు తినడం కంటి ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా ఆవాల ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు కళ్లను కాపాడతాయి. దృష్టిలోపాలను సరిచేస్తాయి.
చలికాలంలో ఆవాల ఆకులతో పరోటా చేసుకోవచ్చు. బంగాళదుంపతో ఆలూ పరాఠాను ఎలా తయారుచేస్తామో.. అలాగే ఈ ఆకులతో కూడా పరాఠాను చేసుకోవచ్చు. లేదా ఆలూకి కొంత ఆకులను కలిపి కూడా చేసుకోవచ్చు. రోజూ ఉదయం టిఫిన్‌లా తీసుకుంటే శరీరం చురుగ్గా ఉండి బాగా పనిచేసుకోగలుగుతారు..ఈ ఆకులను పులుసులు, పప్పుల పచ్చళ్లలో కూడా వాడుకోవచ్చు.
మీరు పెరుగు, శెనగపిండి పేస్ట్, తురిమిన దోసకాయ, తరిగిన పచ్చిమిర్చి వేసి కూడా ఆవాలు, బచ్చలికూర రైతా చేయవచ్చు. మనం దీన్ని వెజిటబుల్ సలాడ్‌లకు యాడ్‌ చేసుకోవచ్చు.. మనం అన్ని గ్రేవీలకూ కొద్దిగా ఆవ ఆకులు వేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..
ఆవనూనెను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు సొంతంగా ఆవ మొక్కల్ని పెంచవచ్చు. కొన్ని ఆవాలను మట్టి కుండీలో వేస్తే చాలు.. నాలుగు రోజుల్లో మొలకలు వస్తాయి. నెల రోజుల్లో ఆవాల మొక్కలు వస్తాయి.. ఇంట్రస్ట్‌ ఉంటే ఒకసారి ట్రే చేయండి. క్లియర్‌గా ఎలా పెంచాలో సోషల్‌ మీడియాలో వీడియోలు చూడండి. ఆకు కూరలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.. పైగా మనం పండించుకుని తినేవి అయితే ఇంకా మేలు.. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఉంటాం..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version