RC 15 : రామ్ చరణ్ మరియు శంకర్ షాకింగ్ రెమ్యునరేషన్స్.!

-

పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్  చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ప్రస్తుతం  శంకర్  ఇండియన్ 2 కూడా తీస్తున్నాడు రెండూ ఒకే సారి కావటం తో శంకర్  అందుకు తగ్గట్టుగానే రెండు సినిమాల షూటింగ్స్ ప్లాన్ చేసాడట. రెండు సినిమాల కు  చెరి సగం రోజుల చొప్పున డేట్స్ ఇస్తూ నడపిస్తున్నాడు.

వాస్తవానికి శంకర్ ఏనాడూ రెండు సినిమాలు ఒకే సారి షూటింగ్ చేసింది లేదు. తాను ఒక ప్రోజెక్ట్ మీద దృష్టి పెడితే దాన్ని కంప్లీట్ చేసేదాకా వేరేది ముట్టు కొనే వాడు కాదుకాని ప్రస్తుతం రెండు సినిమాల వల్ల శంకర్ స్ట్రెస్ గురి అవుతున్నారు అని తమిళ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండియన్ 2 సినిమా త్వరగా పూర్తి చేయాలని కమల్ హాసన్ మరియు నిర్మాతలు ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. కాని శంకర్ మాత్రం ఏమాత్రం క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా తీసే రకం.కానీ ఇప్పుడు రెండు సినిమాలకు టైమ్ కేటాయించ లేక ట్రెస్ గా ఫీల్ అవుతున్నాడట.

ఇక ఈ సినిమా గురించి మరో న్యూస్ హల్చల్ చేస్తోంది.ఈ  చిత్రం బడ్జెట్  మొదట 300 కోట్లు అనుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో మరో వంద కోట్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బడ్జెట్‌లకు ఓకే అని దిల్ రాజు ముందుకు వెళ్తున్నారట. మరో షాకింగ్ న్యూస్ ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమా కోసం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ శంకర్ కు 50 కోట్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version