లైగర్ కోసం విజయ్ దేవరకొండ పారితోషకం ఎన్ని కోట్లో తెలుసా..?

-

నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో నటించి మెప్పించాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాల విజయంతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ద్వారక , నోటా, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచినప్పటికీ విజయ్ దేవరకొండకు మాత్రం గుర్తింపు లభించింది.ఇక తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ దేవరకొండ టైగర్ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే రాబడుతుందని సమాచారం. ఇక చిత్ర బృందం చేపట్టిన ప్రమోషన్స్.. వసూళ్లు రాబట్టడానికి మరొక కారణం అని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఇక బాలీవుడ్ లో ఈ సినిమాకు హైప్ పెరగడానికి కారణం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాతగా బాధితులు చేపట్టడమే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.పాన్ ఇండియా సినిమాలో మొదటిసారి నటించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాకు గాను ఎంత పారితోషకం తీసుకున్నాడు అనే విషయం వైరల్ గా మారుతుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ఏకంగా రూ.35 కోట్ల పారితోషకం అందుకున్నాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ రేంజ్ లో విజయ్ దేవరకొండ పారితోషకం తీసుకున్నాడు అనే వార్తలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే దీనిపై అధికారికంగా ప్రకటించక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version