మహేశ్ బాబు నటించిన తొలి చిత్ర విశేషాలివే..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ..‘సర్కారు వారి పాట’ చిత్రంతో ఘన విజయం అందుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు మహేశ్. అయితే, హీరోగా ప్రిన్స్ మహేశ్ ఎంట్రీ ‘రాజ కుమారుడు’ పిక్చర్ తో జరిగినప్పటికీ.. అంతకు మునుపే బాల నటుడిగా ఆయన పలు చిత్రాల్లో నటించారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మహేశ్ బాబు.. తన అన్న రమేశ్ బాబు, తండ్రి కృష్ణతో పలు చిత్రాల్లో కలిసి నటించాడు. బాల నటుడిగా మహేశ్ 9 సినిమాల్లో నటించాడు. దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రమేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నీడ’ చిత్రంలో మహేశ్ తొలి సారి నటించారు. అయితే, ఇందులో మహేశ్ నటించినప్పటికీ ఆయన తాను నటించానన్న విషయం తెలియలేదు. ఈ చిత్రం చేసే నాటికి మహేశ్ బాబు ఏజ్ ఆరేళ్లు మాత్రమే. కాగా, ఊహ తెలిసిన తర్వాత మహేశ్ బాబు నటించిన పిక్చర్ ‘పోరాటం’.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన ‘పోరాటం’ చిత్రంలో మహేశ్ బాల నటుడిగా నటించారు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో మహేశ్ బాబు నటించాడు. తన లాగా ఉండే డూప్స్ వచ్చినపుడు వారిని వద్దని వారించి, రిస్కీ షాట్స్ కూడా చేశాడు మహేశ్. ‘శంఖారావం’ చిత్రంలో డూప్స్ వద్దని మహేశ్ చెప్పాడు.

తనకు హాలీడేస్ ఉన్నపుడే సినిమాల్లోకి వచ్చి నటించాడు మహేశ్. అలా మహేశ్ ‘అన్నా తమ్ముడు’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘ముగ్గురు కొడుకులు’, ‘బజార్ రౌడీ’, ‘గూఢచారి 117’ చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత చదువుపైన దృష్టి పెట్టాడు. కృష్ణ ఆదేశాల మేరకు చదువు పూర్తయిన తర్వాతనే సినిమాలని నిర్ణయించుకున్నాడు మహేశ్. మహేశ్ బాబును హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇంట్రడ్యూస్ చేశారు. అశ్వినీదత్ ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేశారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు ప్రిన్స్. ఇక ఇప్పుడు మహేశ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version