అరెరే…కొంచెం తినగానే కడుపు నిండిపోతుందా..? ఈ టిప్స్‌ పాటించేయండి..!

-

చాలామందికి కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. గ్యాస్‌, మలబద్ధకం, తిన్నది అరగకపోవడం, కడుపు ఉబ్బరం, బాగా ఆకలేస్తుంది కానీ కొంచెం తినగానే ఎక్కువైపోయి ఉబ్బినట్లు అవుతుంది. వీటన్నింటికి కారణం లోపల మిషన్‌ పాడవడమే.. జీర్ణక్రియ ప్రక్రియ దెబ్బతినడం వల్లే ఈ సమస్యలు వస్తాయట. ఇలా అనిపిస్తే తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు వైద్యులు. ఇంకా ఇలా కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నట్లే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.. అవేంటంటే..

పుదీనా టీ

తిన్న తర్వాత కడుపు ఉబ్బరం ఉంటే ఆహారంలో పుదీనా టీని చేర్చుకోండి. పుదీనా టీ వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా మీ డైలీ రొటీన్‌లో చమోమిలే టీని కూడా చేర్చుకోవచ్చు.

ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోండి..

బాడీలో ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉంటే లోపల ఉన్న చెత్త అంతా చీపురు పెట్టి ఊడ్చినట్లు మొత్తం తొలగిస్తుంది. తినే ఆహారంలో ఫైబర్‌ లేదంటే ఇంట్లో చీపురు లేనట్లే.. ఎక్కడ కొవ్వు అక్కడ పేరుకుపోతుంది. మలబద్దకం, విసర్జన సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అపానవాయువు ఫిర్యాదు కూడా ఉండవచ్చు. మలబద్ధకం ఫిర్యాదుల కారణంగా అపానవాయువు ఉంటే ఈ పరిస్థితిలో ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోండి. దీని కోసం ఆహారంలో బీన్స్, ఒలిచిన బంగాళాదుంపలు, గింజలు, తృణధాన్యాలు మొదలైన వాటిని చేర్చుకోవచ్చు.

హైడ్రేటెడ్‌గా ఉండండి..

ఉదరం ఉబ్బరం సమస్యను అధిగమించడానికి మీ ఆహారంలో ఎక్కువ ద్రవ పదార్థాలను చేర్చుకోండి. బాడీ హైడ్రెట్‌గా ఉంటే తిన్న ఆహారం త్వరగా అరిగిపోతుంది. ఆహారం సమయానికి అరిగిందంటే ఎలాంటి సమస్యా ఉండదు. బండి నడవడానికి. పెట్రోల్‌ ఎంత అవసరమే..బాడీ లోపల అవయవాలు తమ పని తాము చేసుకోవడానికి వాటర్‌ అంత అవసరం. కాబట్టి మనం రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. దీంతో కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది. కిడ్నీలు కూడా క్లీన్‌ చేసిన వేస్ట్‌జ్‌ను అంతా మూత్రం ద్వారానే బయటకు పంపుతాయి. మీరు అసలు నీరే సరిగ్గా తాగకుంటే ఆ వ్యర్థపదార్థాలు అంతా మళ్లీ అక్కడక్కడే తిరుగుతాయి కదా…! కాబట్టి వాటర్‌ బాగా తాగాలి.. దాహం వేసినప్పుడే కాదు..గంటకోసారి అని తాగుతూ ఉంటుంటే స్కిన్‌ కూడా బాగుంటుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version