ఈ ఆలయాల్లో ఆల్కహాల్ ని ప్రసాదంగా ఇస్తారు తెలుసా..?

-

నిజానికి మనం కొన్ని పద్ధతుల్ని చూస్తే ఎంతో విచిత్రంగా కనబడుతుంటాయి. మామూలుగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రసాదం కింద ఆహార పదార్థాలను పెడుతూ ఉంటారు. పులిహోర చక్కెర పొంగలి మొదలైన వాటిని దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు. ఇది నిత్యం మనం చూసేదే. కానీ కొన్ని దేవాలయాల్లో మాత్రం ప్రసాదం కింద లిక్కర్ ఇస్తూ ఉంటారు. అయితే మరి ఏ దేవాలయాల్లో ఆల్కహాల్ ని ప్రసాదంగా ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీలో వుండే కాళీ మాత ఆలయం:

విస్కీ, వైన్ ఇలా ఎన్నో రకాల లిక్కర్లు ని కాళీ మాతకు ఇస్తారు. కానీ వచ్చిన భక్తులకి కాదు. తల్లికి మాత్రమే ఆలయం లో విస్కీ, వైన్ అర్పించడం జరుగుతుంది.

ఉజ్జైన్ లో వుండే కాలభైరవ ఆలయం:

ఈ దేవాలయంలో అయితే దేవుడికి భక్తులు మందుని నైవేద్యంగా ఇస్తారు. లిక్కర్ సహా పలు రకాలను అందిస్తారు. మందు మాత్రమే కాక మాంసం, చేప, గ్రైన్స్ మరియు సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరుపుతారు. దీనిని పంచమకార్ర అంటారు. అయితే ఆల్కహాల్ ని దైవానికి ఇచ్చాక మిగిలిన దానిని భక్తులు తీసుకోవడం జరుగుతుంది.

పాటియాలా లోని కాళీ ఆలయం:

ఇక్కడ కూడా భక్తులు దేవికి ఆల్కహాల్ ని సమర్పిస్తారు. అలానే ఆల్కహాల్ తో పాటుగా కోడి, మేక మొదలైన వాటిని కూడా తీసుకు వచ్చి అర్పించడం జరుగుతుంది. ఆ తరవాత భక్తులు వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version