ఇలాంటి వారి దగ్గర డబ్బు నిలువదు తెలుసా..?

-

నిజంగా లక్ష్మి దేవి ఇంట్లో ఉండాలంటే మనం మంచి పద్దతులను పాటించాలి అలానే మంచిగా ఉండాలి. అందరి ఇంట్లోనూ డబ్బులు నిలువవు. కొందరు ఎంత కష్ట పడినా సరే ఫలితం ఉండదు. అయితే మనం కొన్ని కొన్ని తప్పులను చేయడం వలన లక్ష్మి దేవి ఇంట్లో ఉండదు. అయితే మరి ఏ తప్పులు చేయకూడదు అనేది చూద్దాం.

అస్తమాను నిద్రపోకూడదు:

లక్ష్మి దేవి ఇంట్లో ఉండాలంటే అస్తమాను నిద్రపోకూడదు. ముఖ్యంగా పగటి పూట నిద్రపోకూడదు. రాత్రి మాత్రమే నిద్రపోవాలి. పగటి పూట నిద్రపోయారంటే ధనలక్ష్మి వెనక్కి వెళ్ళిపోతుంది. కనుక లక్ష్మి దేవి ఇంట్లో ఉండాలంటే అస్తమాను నిద్రపోకూడదు.

కోపంగా వుండకూడదు:

కోపంగా ఉండడం వలన ధనలక్ష్మి వెనక్కివెళ్ళిపోతుంది. కనుక మంచిగా ప్రశాంతంగా వుండండి. లక్ష్మి దేవి ఇంట్లో ఉండాలంటే ఎప్పుడు కూడ మంచిగా ఉండాలి. చెడు మాట్లాడినా కఠినమైన మాటలు మాట్లాడినా ధనలక్ష్మి వెనక్కివెళ్ళిపోతుంది.

అతిగా తినడం కోసం ఖర్చు చెయ్యకూడదు:

అతిగా తినడం కోసం ఖర్చు చెయ్యకూడదు. ఆకలి వేసిన దాని కంటే ఎక్కువ తినకూడదు. అలానే అతిగా తినడం కోసం ఖర్చు చెయ్యకూడదు కూడ. ఇలా చేసిన కూడ ధనలక్ష్మి వెనక్కివెళ్ళిపోతుంది.

ఇంటికి వచ్చిన వాళ్ళను అగౌరవపరచద్దు:

ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన వాళ్ళను గౌరవించాలి. ఇంటికి వచ్చిన వాళ్ళను అగౌరవపరచద్దు. అలా చేస్తే లక్ష్మి దేవి నిలువదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version