పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన నటించిన ‘జల్సా’, ‘తమ్ముడు’ చిత్రాలను రీ-రిలీజ్ చేశారు. ఆ ఫిల్మ్స్ చూసి పవన్ అశేష అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ నుంచి మరో అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్.
‘దూసుకొస్తుంది వీరమల్లు విజయ రథం’ అంటూ ‘హరి హర వీరమల్లు’ చిత్రం నుంచి మరో పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అది చూసి పవన్ ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. సెప్టెంబర్ 2న ఆ చిత్రం నుంచి గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించిన ‘కోబ్రా’ చిత్రంతో స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా పరిచయమయ్యారు. ఈ ఫిల్మ్ లో ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటించారు.
‘కోబ్రా’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో తెలుగు హీరోలపైన పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్, స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ సినిమాలను తాను చూశానని తెలిపారు.
ఇటీవల విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చూసి తాను ఆకర్షితుడయ్యానని తెలిపారు. సౌత్ ఫిల్మ్స్ ను తాను ఫుల్ ఎంజాయ్ చేస్తానని చెప్పారు. ఇర్ఫాన్ పఠాన్ నోట పవన్ కల్యాణ్ మాట వినబడగానే ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఇర్ఫాన్ పఠాన్ పేరుతో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా పవన్ ఫ్యాన్స్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ను కూడా ప్రమోట్ చేస్తున్నారు.