భారతీయ చిత్ర పరిశ్రమలో మహోన్నత గాయకుడిగా… భారతీయ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహోన్నత వ్యక్తిగా బాలు ప్రస్థానం అనిర్వచనీయం. ఏకంగా 40 వేలకు పైగా పాటలు పాడి ఎంతో మంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం. బహుముఖ ప్రజ్ఞాశాలిగా కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్థానం ఎంతో అద్భుతంగా సాగింది. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మృతి ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అన్న విషయం తెలిసిందే.
కాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై ఎంతోమంది సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం చివరిసారిగా పలాస 1978 సినిమాలోని ఓ సొగసరి పాట పాడారు. లక్ష్మీ భూపాల రాసిన ఈ పాటను రఘు కుంచె స్వరపరచగా… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం… సింగర్ బేబీ పాడారు. ఈ పాట ఎంతోమందిని ఎంతగానో అలరించింది. అయితే తన సినిమాలో బాలు పాడటం తన అదృష్టమని రఘు కుంచె పేర్కొన్నారు.