కరోనా వైరస్ పేరు వింటే చాలు సాధరణ మానవుడి దగ్గర నుండి ధనవంతుల దాక వణికిపోతున్నారు. ఎందుకంటే కరోనా కి కనికరం లేదు.చిన్నా, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేదు. ఎప్పుడు ఏ రూపంలో వ్యాప్తి చెందుతుందో తెలియదు.అయితే ఈ కరోనా ఇప్పుడు భగవంతుడు సన్నిధిని కూడా వదలలేదు. కరోనా మహమ్మారి కారణంగా కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని మూసివేయాలిసిన పరిస్థితి వచ్చింది. అవును మీరు విన్నది నిజమే. ఆలయ ప్రధాన అర్చకుడు పెరియనంబితో పాటుగా మొత్తం 12 మందికి కరోనా సోకడంతో ఆలయాన్ని ఇప్పుడు తాత్కాలికంగా మూసివేశారు.
కరోనా వ్యాప్తి కారణంగా అక్టోబర్ 15 వరకు ఆలయంలో భక్తుల ప్రవేశానికి అనుమతి లేదని పద్మనాభస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రతీషన్ తెలిపారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఆలయం మూసివేత ఇది రెండో సారి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 21న పద్మనాభస్వామి ఆలయాన్ని మూసివేశారు. మళ్ళీ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆగష్టు చివరన మళ్ళీ ఆలయాన్ని తెరిచారు. అప్పటి నుండి ఎంతో జాగ్రత్తగా కోవిడ్ నిభందనలు పాటిస్తూ భక్తులకు స్వామి వారి దర్శనాన్ని అనుమతిస్తున్నారు.కానీ మళ్ళీ ఇప్పుడు రెండోసారి కరోనా కారణంగా ఆలయం మూసివేస్తున్నారు.ఆలయం మూసివేసిన సమయంలో కేవలం భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. అలాగే రోజువారి కార్యక్రమాలు యథావిథిగా కొనసాగుతాయని చెప్పారు.